NTV Telugu Site icon

ICC T20 Rankings: నెంబర్‌వన్‌కు చేరువలో హార్దిక్ పాండ్యా..గిల్‌ దూకుడు

A7f5aec5 6bbd 42b9 86e1 3d67549b32f6

A7f5aec5 6bbd 42b9 86e1 3d67549b32f6

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి రిలీజ్ చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడంతో పాటు అద్ఫుత పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాండ్యా ఆల్‌రౌండర్ విభాగంలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ మహ్మద్ నబీని వెనక్కు నెట్టి రెండో ప్లేస్‌కు చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో పాండ్యా నాలుగు ఓవర్లలో 4/16తో చెలరేగాడు. బ్యాటింగ్‌లోనూ 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. పాండ్యా ఖాతాలో ప్రస్తుతం 250 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షకిబ్‌కు పాండ్యాకు మధ్య కేవలం రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది.

Also Read: Rishabh Pant: ‘పంత్.. నిన్ను కొట్టేస్తా’: మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

ఇక, బ్యాటింగ్ విభాగంలో టాప్ 100లో కూడా లేని యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఏకంగా 30వ ర్యాంక్‌కు ఎగబాకాడు. న్యూజిలాండ్‌పై 63 బంతుల్లో 126 పరుగులతో మెరుపు సెంచరీ చేసిన గిల్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఉనికి చాటుకున్నాడు. ఈ సెంచరీతో ఏకంగా 168 స్థానాలు ఎగబాకి.. 30వ స్థానానికి చేరుకున్నాడు. ఇంతకు ముందు టీ20 క్రికెట్‌లో గిల్‌కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. తొలి హాఫ్ సెంచరీనే శతకంగా మలిచి.. టీ20 క్రికెట్‌ ర్యాంకింగ్స్‌‌లో సత్తాచాటాడు. ఈ విభాగంలో సూర్యకుమార్ నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. కాగా, బౌలర్ల కేటగిరీలో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ర్యాంక్ కూడా మెరుగైంది. అతడు ఎనిమిది స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు 21వ ర్యాంక్‌లో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు 635 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్‌లో ఉన్నాడు.