తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదవ T20I మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలింగ్ చేయనుంది. కాగా భారత్ మొదటి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, టీం ఇండియా నాలుగో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐదవ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని టీం ఇండియా చూస్తోంది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్ ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు, ఎందుకంటే అతను మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందాలని చూస్తున్నాడు.
IND vs NZ 5th T20: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Ind Vs Nz