Site icon NTV Telugu

IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?

Ind Vs Wi

Ind Vs Wi

IND vs WI: ఢిల్లీలో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ లో నేడు (అక్టోబర్ 10) భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మొదటి రోజు మొదటి సెషన్ ను టీమిండియా స్లో అండ్ స్టడీగా కొమసాగింది. దీంతో లంచ్ సమయానికి టీమిండియా 28 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 94 రన్స్ చేసింది. ఇక లంచ్ సమయానికి యశస్వి జైస్వాల్ 78 బంతుల్లో 40 రన్స్, సాయి సుదర్శన్ 36 బంతుల్లో 16 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. KL రాహుల్ 38 పరుగుల వద్ద జొమెల్ వారికన్ బౌలింగ్ లో స్టూమ్ప్ అవుట్ అయ్యి వెనుతిరిగాడు. ఇక జైస్వాల్ తన వైఖరికి పూర్తి బిన్నంగా చాలా ఓపికతో ఆకట్టుకునే స్ట్రోక్ ప్లే చేస్తూ బాగా బ్యాటింగ్ చేసాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా మంచి ప్రారంభం అందుకున్నారు.

Velammal Cricket Stadium: అంతర్జాతీయ ప్రమాణాలతో మదురైలో క్రికెట్ స్టేడియంను ప్రారంభించిన ధోని!

Exit mobile version