IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వీరవిహారం చేశారు. విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ మైదానంలో పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 406 పరుగుల అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించడమే కాకుండా, సెంచరీలతో చెలరేగిపోయారు.
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 72 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్, మొత్తంగా 74 బంతుల్లో 10 ఫోర్లు, 6 అద్భుతమైన సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. మరోవైపు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. గిల్ కేవలం 85 బంతుల్లోనే ఏకంగా 17 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 144 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా దూసుకుపోతున్నాడు.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు విండీస్ బౌలింగ్‌ను పూర్తిగా చిత్తు చేశారు. మొదటి వికెట్‌కు ఈ జోడీ కేవలం 156 బంతుల్లోనే అజేయంగా 254 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 254 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో ఉంది. రన్ రేట్ 9.77 వద్ద అద్భుతంగా కొనసాగుతుండగా, భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరమై ఉన్నాయి. గత 10 ఓవర్లలో ఏకంగా 102 పరుగులు రాబట్టడం విశేషం. రోహిత్, గిల్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్ ఈ భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా.. ఇంటర్నేషనల్ వన్డే చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో 5 గురు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌లో ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేయగా.. భారత్ నుంచి రోహిత్, గిల్ సెంచరీలు చేశారు.
తాజావార్తలు
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!