Richa Ghosh Record: రిషబ్ పంత్ రికార్డ్ బద్దలు కొట్టిన రిచా ఘోష్!
- రిచా ఘోష్ చరిత్ర
- అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ
- రిషబ్ పంత్ రికార్డ్ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Richa Ghosh Breaks Rishabh Pant’s T20I Record: టీమిండియా మహిళా బ్యాటర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డ్ నమోదు చేసింది. మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఫిఫ్టీ చేయడంతో రిచా ఈ ఘనత అందుకుంది. యూఏఈపై రిచా 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
రిచా ఘోష్ 20 ఏళ్ల 297 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసింది. దాంతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టింది. పంత్ 21 ఏళ్ల 206 రోజుల వయసులో టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాదు మహిళల ఆసియా కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపగా రికార్డుల్లో నిలిచింది. రిచా ఇప్పటివరకు 2 టెస్టులు, 23 వన్డేలు, 52 టీ20లు భారత్ తరఫున ఆడింది. టీ20ల్లో ఇదే మొదటి ఫిఫ్టీ కావడం విశేషం.
Also Read
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Crispy Bread Pakoda Recipe: పిల్లలు ఎగబడి తినే స్నాక్.. ఇంట్లోనే కరకరలాడే బ్రెడ్ పకోడా ఇలా తయారు చేసుకోండి!
Also Read: Geoffrey Boycott Health: ఆసుపత్రిలో క్రికెట్ దిగ్గజం.. పరిస్థితి విషమం!
రిచా ఘోష్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిచా సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66) హాఫ్ సెంచరీ చేసింది. టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. చేధనలో యూఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కవిషా (40 నాటౌట్) టాప్ స్కోరర్.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!