NTV Telugu Site icon

Richa Ghosh Record: రిషబ్ పంత్ రికార్డ్ బద్దలు కొట్టిన రిచా ఘోష్!

Richa Ghosh Rishabh Pant

Richa Ghosh Rishabh Pant

Richa Ghosh Breaks Rishabh Pant’s T20I Record: టీమిండియా మహిళా బ్యాటర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డ్ నమోదు చేసింది. మహిళల ఆసియా కప్‌ 2024లో భాగంగా ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఫిఫ్టీ చేయడంతో రిచా ఈ ఘనత అందుకుంది. యూఏఈపై రిచా 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

రిచా ఘోష్ 20 ఏళ్ల 297 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసింది. దాంతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టింది. పంత్ 21 ఏళ్ల 206 రోజుల వయసులో టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాదు మహిళల ఆసియా కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపగా రికార్డుల్లో నిలిచింది. రిచా ఇప్పటివరకు 2 టెస్టులు, 23 వన్డేలు, 52 టీ20లు భారత్ తరఫున ఆడింది. టీ20ల్లో ఇదే మొదటి ఫిఫ్టీ కావడం విశేషం.

Also Read: Geoffrey Boycott Health: ఆసుపత్రిలో క్రికెట్ దిగ్గజం.. పరిస్థితి విషమం!

రిచా ఘోష్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిచా సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66) హాఫ్ సెంచరీ చేసింది. టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. చేధనలో యూఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కవిషా (40 నాటౌట్) టాప్ స్కోరర్.