Site icon NTV Telugu

IND vs SL T20: ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయిన భారత్..

Ind Vs Sl

Ind Vs Sl

IND vs SL T20: నేడు జరుగుతున్న భారత్ – శ్రీలంక మధ్య నామమాత్రపు మూడో టి20లో ఆతిధ్య టీం టాస్ ను గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే వికెట్లను వరుసగా కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ కేవలం పది పరుగులకే వెలుగు తిరగగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి డక్ అవుట్ గా వెనుతిరిగి నిరాశపరిచాడు. ఇక బ్యాటింగ్ లైనప్ లో ప్రమోషన్ పొందిన రింకు సింగ్ కూడా కేవలం ఒక్క పరుగుతోనే వెను తిరిగాడు. శ్రీలంక టీంలో తీక్షణ 2 వికెట్లు తీసుకోగా.. చేమింద ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక నేటి ఇరు జట్ల ఆడగాళ్ళ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీలంక జట్టు: పాథుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరెరా, కామిండు మెండిస్, చరిత్ అసలంక (capt), చామిండు విక్రమసింఘే, వనిందు హసరంగ, రమేష్ మెండిస్, మహేష్ తీక్షణ, మతీషా పతిరానా, అసిథా ఫెర్నాండో

భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.

Exit mobile version