NTV Telugu Site icon

IND vs NZ Test: భారత్‌ ఓటమికి సీనియర్‌ ఆటగాళ్లదే బాధ్యత: కార్తీక్‌

Team India Test

Team India Test

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌ ఓటమికి సీనియర్‌ ఆటగాళ్లదే బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. జట్టుపై కోచ్‌ ప్రభావం చాలా తక్కువ అని నా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ మైదానంలో అడుగు పెట్టడని, కెప్టెనే అన్నీ చూసుకుంటాడన్నాడు. ఓటములు ఎదురైనపుడు విమర్శలు వస్తే.. వాటినీ తీసుకోవాలని డీకే పేర్కొన్నాడు. రోహిత్ సేన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే.

‘న్యూజిలాండ్‌ సిరీస్‌ ఓటమి బాధ్యతను సీనియర్లకు ఎందుకు ఇవ్వకూడదు. తాము ఇంకా మెరుగైన ప్రదర్శన చేసి ఉండాల్సిందేమో అని సీనియర్స్ అనుకుంటారు. జట్టు గెలిచినపుడు, ఏదైనా కప్ సాధించినపుడు సంబరాలు చేసుకున్నట్లే.. ఓటములు ఎదురైనపుడు వచ్చే విమర్శలను తీసుకోవాలి. సీనియర్లు ఈ సిరీస్‌లో ఏం సాధించారో చెప్పడానికి ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు మ్యాటర్ అది కాదు. భారత టెస్టు క్రికెట్‌ భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి’ అని దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు.

Also Read: Nitish Kumar Reddy: నితీశ్‌ రెడ్డి ఒక్కడే.. ఇదే సూపర్ ఛాన్స్!

‘జట్టుపై కోచ్‌ ప్రభావం తక్కువ అని నా అభిప్రాయం. జట్టులో 11వ ఆటగాడి కంటే కూడా కోచ్‌ ప్రమేయం తక్కువ. కోచ్ మైదానంలో అడుగు పెట్టడు, కెప్టెనే అన్నీ చూసుకుంటాడు. వాషింగ్టన్‌ సుందర్‌ ఎంపికకు కోచ్ గౌతమ్ గంభీర్‌ను అభినందించాలి. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ ఖాన్ కంటే ముందు సుందర్‌ను బ్యాటింగ్‌కు పంపడం, నలుగురు స్పిన్నర్లను ఎంచుకుని ఉంటే బాగుండేదన్న విషయాలపై చర్చించవచ్చు. కానీ ఈ సిరీస్ ఓటమికి గంభీర్‌ను మాత్రమే బాద్యుడిని చేయడం సరికాదు’ అని డీకే పేర్కొన్నాడు.

Show comments