IND vs NZ T20: భారత్–న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు మొదలు కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు ఉత్సాహంగా ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టీ20 సిరీస్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే, మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటివరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 విజయాలు, 2 పరాజయాలు ఉన్నాయి. చివరిసారిగా 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
7,000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో Oppo A6 5G లాంచ్.. ధర ఎంతంటే..?
భారత్–న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 14 మ్యాచ్‌లు గెలిచితే, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించింది. గణాంకాల ప్రకారం టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు స్వల్ప ఆధిక్యం కనపడుతుంది. తాజాగా ముగిసిన వన్డే సిరీస్ ఎలాగో ఓడిపోయింది.. ఇప్పుడు మొదలు కాబోతున్న టీ20 సిరీస్ అయినా గెలవాలని టీమిండియా అభిమానులు ఆకాంశిస్తున్నారు. ఇక నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు కీలక విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్ ఆడబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక నేటి మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
Naveen Polishetty: అక్కడ ప్రదీప్ రంగనాథన్.. ఇక్కడ నవీన్ పోలిశెట్టి!
