Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..

Eee

Eee

క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మ్యాచ్‌లు చివరి వరకు ఇలాగే ఉత్కంఠగా సాగుతాయని, మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకోబ్స్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా అద్భుతంగా ఆడి జట్టును 180 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారని తెలిపారు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ మైదానం వీడటం గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త మాత్రమేనని, సిరీస్‌లో త్వరగా జరిగే మ్యాచ్‌ల కారణంగా రొటేషన్ అవసరమని పేర్కొన్నారు.

భారత బ్యాటింగ్ గురించి స్పందిస్తూ.. తిలక్ వర్మ, నమన్ ధీర్, చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి తమ కొంపముంచారని సాంట్నర్ వాపోయారు. తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి భాగస్వామ్యాన్ని విడదీసి ఉంటే మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చేదని, తాము గెలిచాం అనుకునే లోపే అంతా మారిపోయిందని అభిప్రాయపడ్డారు.

ఛేజింగ్‌ను వారు హ్యాండిల్ చేసిన తీరు తమను ఒత్తిడికి గురిచేసిందని, దాంతో చివర్లో కొన్ని పొరపాట్లు చేయాల్సి వచ్చిందని తెలిపారు. మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించినప్పటికీ, నో-బాల్‌కు వికెట్ పడటం వంటి చిన్న చిన్న ఫీల్డింగ్ తప్పిదాలు తమ విజయవకాశాలను దెబ్బతీశాయని, నైపుణ్యాల పరంగా బాగానే ఆడినా కీలక సమయాల్లో చేసిన పొరపాట్లే ఓటమికి కారణమయ్యాయని సాంట్నర్ వెల్లడించారు.