NTV Telugu Site icon

IND vs NZ: టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!

Ind Vs Nz Toss

Ind Vs Nz Toss

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పు చేసింది. హర్షిత్‌ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. 14వ సారి భారత్ టాస్‌ను ఓడిపోవడం విశేషం.