NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 147

India Vs New Zealand

India Vs New Zealand

IND vs NZ: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబై నగరంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడవరోజు ఆటను మొదలుపెట్టిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు అలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్ లోనే మిగతా ఒక్క వికెట్ కోల్పోయి 174 పరుగులకు అలౌట్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి ఐదు వికెట్లతో తన సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు.

Read Also: Ishan Kishan Ball Tampering: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల విషయంలో అంపైర్‌తో గొడవ పడ్డ ఇషాన్ కిషన్

ఇకపోతే, మొదటి ఇన్నింగ్స్ లో 28 పరుగుల ఆదిత్యం సాధించిన టీమిండియాకు ప్రస్తుతం 147 పరుగుల లక్ష్యాన్ని అందించింది న్యూజిలాండ్. చూడాలి మరి స్పిన్నర్స్ రాణిస్తున్న ఈ పిచ్ పై న్యూజిలాండ్ బౌలర్లను టీమిండియా బ్యాట్స్మెన్స్ ఏ విధంగా ఎదుర్కొని విజయం సాధిస్తారో. ఇప్పటికే ఈ సిరీస్ ను న్యూజిలాండ్ 2 -0 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read Also: Bangladesh: 3 నెలల్లో 2000 మందిపై దాడులు.. భద్రత కల్పించాలంటూ హిందువులు డిమాండ్

Show comments