NTV Telugu Site icon

IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే మొదటిసారి!

India Test

India Test

Team India Hit 100 Sixes in a Test Calendar Year: టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్‌ ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్స్‌లు బాదిన మొదటి జట్టుగా భారత్ రెకార్డుల్లోకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిక్సర్‌ బాదడంతో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని చేరుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే జట్టు కూడా ఈ అరుదైన ఫీట్ అందుకోలేదు.

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటర్లు ఏకంగా 72 సిక్స్‌లు బాదారు. ఇందులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్కడే 26 సిక్స్‌లు కొట్టడం విశేషం. బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్‌, న్యూజిలాండ్‌ మొదటి టెస్ట్ మ్యాచ్‌‌తో 100 సిక్స్‌ల మైలురాయిని టీమిండియా పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు భారత జట్టు 102 సిక్స్‌లు బాదింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ (2022లో 89 సిక్స్‌లు) రెండో స్థానంలో ఉంది. భారత్ (2021లో 87 సిక్స్‌లు), న్యూజిలాండ్ (2014లో 81 సిక్స్‌లు), న్యూజిలాండ్ (2013లో 71 సిక్స్‌లు) టాప్-5లో ఉన్నాయి.

Also Read: IND vs NZ: ప్రపంచకప్ ఫైనల్‌ గుర్తుందిగా.. మరోసారి అదే ఫలితాన్ని చూడబోతున్నాం!

బెంగళూరు టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 రన్స్ చేసింది. విరాట్‌ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (70 బ్యాటింగ్‌; 78 బంతుల్లో 7×4, 3×6), రోహిత్‌ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. భారత్‌ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది.