NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి మరో ప్లేయర్ ఔట్!

New Zealand Test

New Zealand Test

Ben Sears Ruled Out of Test Series against India: భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు దూరమవ్వగా.. ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి సియర్స్ దొరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

శ్రీలంక పర్యటనలోనే బెన్ సియర్స్ మోకాలి నొప్పితో బాధపడ్డాడు. భారత్‌తో సిరీస్ సమయానికి అతను కోలుకుంటాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భావించి.. అతడిని ఎంపిక చేసింది. గత వారం కివీస్ టీమ్ భారత్‌కు రాగా.. సియర్స్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సియర్స్ స్థానంలో జాకబ్‌ డఫీని ఎంపిక చేసింది. సియర్స్ కివీస్ తరఫున 1 టెస్టు, 17 టీ20లు ఆడాడు. టెస్టులో 5 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. జాకబ్‌ 6 వన్డేలు, 14 టీ20లు ఆడాడు కానీ.. ఇంకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 299 వికెట్లు తీశాడు.

Also Read: BCCI: విరాట్, రోహిత్ తీవ్ర విమర్శలు.. బీసీసీఐ కీలక నిర్ణయం!

న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, జాకబ్ డపీ, ఇష్ సోథి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

Show comments