Site icon NTV Telugu

IND vs ENG: పెవిలియన్కు వరుస పెట్టిన టీమిండియా బ్యాటర్లు.. భారత్ 224 ఆలౌట్!

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు సుదీర్ఘ పేస్ స్పెల్‌లు వేసి భారత్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా గస్ అట్‌కిన్సన్ ఐదు వికెట్లు తీయగా, జోష్ తంగ్ మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశారు. ఇంగ్లండ్ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, గ్రీన్ పిచ్ కారణంగా ఆరంభంలోనే బ్యాట్స్‌మెన్స్ తీవ్రంగా ఇబ్బందికి గురయ్యారు.

Ambati Rambabu: మీ కుటుంబం చరిత్ర మాకు తెలియదా?.. హోం మంత్రిపై అంబటి రాంబాబు ఫైర్

టీమిండియాకు మరోసారి ఆరంభం సరిగా లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 2 పరుగులకే అట్‌కిన్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 14, శుభ్‌మన్ గిల్ 21 పరుగులతో నిరాశపరిచారు. అయితే సాయి సుదర్శన్ 38 పరుగులతో కాస్త స్థిరంగా ఆడినప్పటికీ, ఎక్కువ కాలం క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ అత్యధికంగా 57 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 26, ధ్రువ్ జురేల్ 19 పరుగులతో మద్దతు ఇచ్చారు. మొదటి రోజు వర్షం కారణంగా పలుమార్లు వర్షం అడ్డంకిగా మారింది. దీనితో భారత్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. ఇక నేడు రెండు రోజులో కెలవం 20 పరుగులు సాధించి చివరి 4 వికెట్లను కోల్పోయింది. చివరిలో వరుసగా వికెట్లు పడిపోవడంతో 69.4 ఓవర్లకే భారత్ 224 పరుగులకే ఆలౌటయ్యింది.

Breast Cancer in Women: మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.? ఈ లక్షణాలు ఉంటే కన్ఫార్మ్!

ఇక ఇంగ్లండ్ బౌలింగ్ లో పేసర్ గస్ అట్‌కిన్సన్ అత్యద్భుతమైన ప్రదర్శనతో 5 వికెట్లు తీశాడు. అలాగే జోష్ తంగ్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీసుకొని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

Exit mobile version