Site icon NTV Telugu

IND vs ENG: నాలుగు కీలక క్యాచ్‌లను డ్రాప్‌ చేసిన యశస్వి.. అంత ఈజీ కాదంటున్న శ్రీధర్‌!

Yashasvi Jaiswal Drop Catch

Yashasvi Jaiswal Drop Catch

లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ నాలుగు కీలక క్యాచ్‌లను డ్రాప్‌ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి టీమిండియా ఆటగాళ్లు 8 క్యాచ్‌లు డ్రాప్‌ చేస్తే.. అందులో నాలుగు జైస్వాల్‌ నేలపాలు చేశాడు. లైఫ్స్ అందుకున్న ఇంగ్లండ్‌ బ్యాటర్లు అదనంగా 250 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో యశస్వి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్ శ్రీధర్‌ యశస్వికి మద్దతుగా నిలిచాడు. చల్లని వాతావరణంలో క్యాచ్‌లు పట్టడం అంత ఈజీ కాదు అని పేర్కొన్నాడు.

Also Read: KL Rahul: దేశానికే తొలి ప్రాధాన్యం.. కేఎల్‌ రాహుల్‌ సూపర్!

‘యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్‌లో తొలి పర్యటనకు వెళ్ళాడు. అక్కడ స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేయడం అంత తేలిక కాదు. ఎంతో ప్రాక్టీస్‌ చేసినా మ్యాచ్‌ విషయానికి వచ్చేసరికి క్యాచ్‌లు పట్టడం సవాలుతో కూడుకున్నది. ఇంగ్లండ్‌లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఒక్కోసారి చేతి వేళ్లు మొద్దుబారి పోయి ఉంటాయి. ఆ వాతావరణంలో డ్యూక్‌ బంతిని పట్టుకోవడం అంత తేలిక కాదు. నిజానికి యశస్వి అద్భుతమైన గల్లీ ఫీల్డర్. మెల్‌బోర్న్‌, లీడ్స్‌లో క్యాచ్‌లు పట్టడానికి ఇబ్బంది పడ్డాడు. కాన్పూర్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. బయటి వ్యక్తులు అతడిని విమర్శించడం తేలికే. మైదానంలో కఠిన పరిస్థితుల్లో యశస్వి తొలిసారి ఆడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి’ అని యశస్వికి ఆర్ శ్రీధర్‌ మద్దతుగా నిలిచాడు.

Exit mobile version