Site icon NTV Telugu

IND vs ENG 5th Test: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆకాష్ దీప్ ఔట్, దేవదత్ పడిక్కల్ అరంగేట్రం!

Devdutt Padikkal Debut

Devdutt Padikkal Debut

England have won the toss and have opted to bat: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఒలీ రాబిన్సన్‌ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకుంది.

మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన రజత్‌ పటీదార్‌ అంచనాలను అందుకోలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 63 పరుగులే చేశాడు. దీంతో చివరి టెస్టుకు అతని స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్‌ను తీసుకున్నారు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆర్ అశ్విన్‌, జానీ బెయిర్‌స్టోకు ఇది వందో టెస్టు మ్యాచ్.

ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్.. చివరి మ్యాచ్‌నూ గెలిచి ఈ సిరీస్‌ను ఘనంగా ముగించాలని రోహిత్‌ బృందం భావిస్తోంది. సిరీస్‌ ఓడినా మరో మ్యాచ్‌ గెలిచి అంతరాన్ని 2–3కు తగ్గిస్తూ.. స్వదేశం వెళ్లాలని స్టోక్స్‌ సేన పట్టుదలగా ఉంది. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

Exit mobile version