Ravichandran Ashwin completes 100 Wickets on England in Tests: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో యాష్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల్లో నిలిచాడు. యాష్ కంటే ముందు జేమ్స్ అండర్సన్ ఈ ఫీట్ అందుకున్నాడు. భారత జట్టుపై టెస్టుల్లో జిమ్మీ 139 వికెట్లు తీశాడు. అండర్సన్ 35 మ్యాచ్‌ల్లో 100 వికెట్స్ తీయగా.. యాష్ 23 మ్యాచ్‌ల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌లోనే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అశ్విన్ అందుకున్న విషయం తెలిసిందే.
Also Read: Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు!
రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అశ్విన్ కంటే ముందు జార్జ్ జిఫెన్ (ఇంగ్లండ్‌పై), మోనీ నోబుల్ (ఇంగ్లండ్‌పై), విల్ఫ్రెడ్ రోడ్స్ (ఆస్ట్రేలియాపై), గ్యారీఫీల్డ్ సోబర్స్ (ఇంగ్లండ్‌పై), ఇయాన్ బోతమ్ (ఆస్ట్రేలియాపై), స్టువర్ట్ బ్రాడ్ (ఆస్ట్రేలియాపై) ఈ ఫీట్ నమోదు చేశారు.
Ash gets a century against England… of wickets!#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/X2wxTkk7xL
— JioCinema (@JioCinema) February 23, 2024