R Ashwin goes past Anil Kumble for most Test wickets in India: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. మూడో టెస్ట్‌లో 500 వికెట్ల మార్క్ అందుకున్న యాష్.. నాలుగో టెస్ట్‌లో భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అనంతరం కుంబ్లే పేరిట ఉన్న అత్యధిక ఐదు వికెట్ల రికార్డును సమం చేశాడు.
అనిల్ కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 35 సార్లు ఐదు వికెట్స్ పడగొట్టాడు. ఆర్ అశ్విన్ కేవలం 99 టెస్ట్‌ల్లోనే ఈ ఘనతను సమం చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్స్ పడగొట్టిన రికార్డు స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. ముత్తయ్య 133 టెస్ట్‌ల్లో 67 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 37 సార్లు), రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్‌ల్లో 36 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యాష్ మరోసారి ఐదు వికెట్స్ పడగొడితే.. కుంబ్లే రికార్డు బ్రేక్ అవుతుంది.
Also Read: IND vs ENG: హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా! సర్ఫరాజ్‌పై రోహిత్ ఫైర్
స్వదేశంలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (352) తీసిన బౌలర్‌గా ఆర్ అశ్విన్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండడం విశేషం. భారత్‌లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (219), రవీంద్ర జడేజా (206) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.