IND vs ENG: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ఉద్వేగ క్షణాల మధ్య తెగ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లలో ఇరు జట్లు 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. అయితే, మూడో రోజు ఆట చివర్లో అసలు హంగామా జరిగింది. భారత ఆటగాళ్లు, ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీపై తమ అసహనాన్ని బహిరంగంగానే చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ గా మారాయి.
ఆట మూడో రోజు భారత తొలి ఇన్నింగ్స్ 145/3 ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభమై చివరికి 387 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అదే స్కోరు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా నమోదు చేయడంతో లీడ్స్ లో లీడ్ ఎవరికీ దక్కలేదు. ఇక మొదటి ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. జస్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేసే సమయంలో జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరూ సమయాన్ని వృథా చేసే ప్రయత్నాలు చేశారు.
Read Also:India T20 Series Win: ఓడినా.. చరిత్ర సృష్టించిన హర్మన్ సేన!
ఆ సమయంలో బంతి వేయడానికి బుమ్రా రన్నప్ తీసుకున్న తర్వాత క్రాలీ ఆగిపోవడం, గాయానికి ఫిజియోను పిలవడం వంటి వ్యూహాత్మక ఆలస్యాలకు తెరలేపారు. ఇది చూసిన భారత ఆటగాళ్లకు తీవ్ర అసహనం కలిగింది. ఈ చర్యలపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా స్పందించాడు. అతను తన అసహనాన్ని బయటపెట్టి, జాక్ క్రాలీపై వాగ్వాదానికి దిగాడు. అతనివైపు దూసుకెళ్లేలా ప్రవర్తించాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా తన మాటలతో స్లెడ్జింగ్ ప్రారంభించాడు. ఇక మిగిలిన భారత ఆటగాళ్లు చప్పట్లతో, మాటలతో క్రాలీని ఎగతాళి చేశారు. అయినా కూడా జాక్ క్రాలీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆట కొనసాగించాడు. బుమ్రా వేసిన ఓవర్‌ను పూర్తిగా ఆచితూచి ఆడి ముగించాడు. ఆ వెంటనే అంపైర్లు ఆటను నిలిపేశారు.
Read Also:Kota Srinivasa Rao: సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయింది: కేసీఆర్
నిజానికి బుమ్రా వేసిన బంతిని ఆడిన క్రాలీ.. బాల్ ఏదో చేతి వెలికి గట్టిగా తగిలినట్లుగా ఓవర్ యాక్షన్ చేశాడు. అంతేకాదు.. గాయానికి ఫిజియోను పిలిచాడు. దీనితో ఆశ్చర్యపోయిన టీంఇండియా ఆటగాళ్లు అతడిపైకి దూసుకెళ్లారు. ఈ వాగ్వాదం నేపథ్యంలో నాలుగో రోజు (ఆదివారం) ఆట మరింత ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం స్కోరు సమంగా ఉన్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శనే ఫలితాన్ని నిర్ధారించనుంది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌట్ చేస్తే.. టీమిండియా విజయం దిశగా అడుగులు వేయగలదు. లేకపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
This is what happened in the Bumrah over pic.twitter.com/wWIwbLVg3C
— Shivang Kaushik (@Shivangkaushik3) July 12, 2025
