NTV Telugu Site icon

Yashasvi Jaiswal Century: ఫోర్‌తో హాఫ్ సెంచరీ.. సిక్స్‌తో సెంచరీ! యశస్వి జైస్వాల్‌ సూపర్ బ్యాటింగ్

Yashasvi Jaiswal Century

Yashasvi Jaiswal Century

Yashasvi Jaiswal Hits Century in IND vs ENG 2nd Test: విశాఖలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ బాదాడు. జైస్వాల్‌కు టెస్టుల్లో ఇది రెండో శతకం. ఇక్కడ విశేషం ఏంటంటే ఫోర్‌తో హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్‌.. సిక్స్‌తో సెంచరీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూపర్ బ్యాటింగ్ చేసిన జైస్వాల్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: IND vs ENG: టెస్టు క్రికెట్‌ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి: సర్ఫరాజ్‌

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (14) మరోసారి నిరాశపరిచినా యశస్వి జైస్వాల్‌ దూకుడు మాత్రం ఆగలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన జైస్వాల్‌.. ఆపై ఊపందుకున్నాడు. ముందుగా శభ్‌మన్‌ గిల్‌ (34)తో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన అతడు లంచ్‌ బ్రేక్‌కు ముందు హాఫ్ సెంచరీ బాదాడు. 30వ ఓవర్లో 6, 4 కొట్టిన జైస్వాల్‌ 51 పరుగులు చేశాడు. గిల్‌ ఔట్ అయినా శ్రేయస్‌ అయ్యర్‌ (27)తో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 58 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. క్రీజ్‌లో యశస్వి (119)తో పాటు అరంగేట్ర బ్యాటర్ రజత్‌ పటీదార్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు.