NTV Telugu Site icon

IND vs ENG: లంచ్‌ బ్రేక్‌.. భారత్ స్కోరు 222/3!

Kl Rahul Test

Kl Rahul Test

IND vs ENG 2nd Day Lunch Break: హైదరాబాద్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు లంచ్‌ విరామానికి భారత తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (55), శ్రేయస్‌ అయ్యర్‌ (29) పరుగులతో ఉన్నారు. భారత్ ఇంకా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌కు 24 పరుగులు వెనకపడి ఉంది. రెండో రోజు మొదటి సెషన్‌లో భారత్ 27 ఓవర్లలో 103 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది.

Also Read: Pawan Kalyan: రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కళ్యాణ్

ఓవర్ నైట్ స్కోర్ 119/1తో రెండో రోజు ఆటను ఆరంబించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 80 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. జో రూట్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జైశ్వాల్‌ ఈరోజు కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆపై క్రీజులోకి కేఎల్‌ రాహుల్‌.. శుబ్‌మన్‌ గిల్‌కు జతకలిశాడు. మొదటి రోజు ఇబ్బందిపడిన గిల్‌.. రెండో రోజు రాణించలేదు. 23 పరుగులు చేసిన గిల్‌.. హార్ట్‌లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌తో రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నాడు.

Show comments