NTV Telugu Site icon

World Cup 2023 Final: అహ్మదాబాద్ పిచ్‌పై ఇంత స్కోర్‌ చేస్తే చాలు.. విక్టరీ పక్కా..!

World Cup 2023 Final

World Cup 2023 Final

World Cup 2023 Final: ఇప్పుడు అందరి కళ్లు అహ్మదాబాద్‌ వైపే ఉన్నాయి.. టికెట్‌ దక్కించుకున్నవారు ఎగిరి గంతేస్తుంటే.. టికెట్‌ దక్కని వారు నిరాశతో వెనుదిరిగారు.. క్రికెట్‌ ఫ్యాన్స్‌తో అహ్మదాబాద్‌ సందడిగా మారింది.. వరల్డ్‌ కప్‌ 2023లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.. దీంతో.. మ్యాచ్‌పై హైప్‌ పెరిగిపోయింది.. అయితే, అహ్మదాబాద్ పిచ్‌పై 315 కొడితే బేఫిక‌ర్ అంటూ క్యూరేట‌ర్ ఆస‌క్తిక‌ర వ్మాఖ్యలు చేశారు..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2023 ఫైన‌ల్‌ రేపు మ‌ధ్యాహ్యం ప్రారంభం కానుంది.. మెగా టోర్నీ ఆదినుంచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది టీమిండియా.. ఆడిన ఏ మ్యాచ్‌లోనూ తడబాటు లేకుండా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. దాంతో, అహ్మదాబాద్ స్టేడియంలో మొద‌ట బ్యాటింగ్ చేస్తే బెట‌రా? ఫీల్డింగ్‌ ఎంచుకోవడం మంచిదా..? ఎన్ని ప‌రుగులు చేస్తే.. ఫలితం ఎలా ఉండబోతోంది? ఇలా అనేక విషయాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. అయితే, ఇదే విష‌యంపై గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ పిచ్ క్యూరేట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్‌పై 315 ప‌రుగులు చేస్తే బేఫిక‌ర్‌గా ఉండొచ్చని అని పేర్కొన్నాడు.. ఒక‌వేళ భారీ రోలర్‌ను ఉప‌యోగించి ఆ త‌ర్వాత పిచ్‌పై న‌ల్లమ‌ట్టిని చ‌ల్లార‌నుకోండి.. పిచ్ స్లోగా ఉంటుంది. భారీ స్కోర్లకు కూడా అవ‌కాశం లేక‌పోలేదు అన్నారు..

అంతేకాదు ప్రతి బంతిని హిట్ చేయ‌డం సాధ్యప‌డదు అని పేర్కొన్నారు క్యూరేటర్‌.. అప్పుడు 315 స్కోర్ చేసినా డిఫెండ్ చేయొచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అయితే, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్, ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌డం ఇది రెండోసారి.. 2003లో రికీ పాంటింగ్ సార‌థ్యంలోని ఆసీస్ పైచేయి సాధించింది. ఈసారి భీక‌ర ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన 20 ఏండ్ల క్రితం ఓట‌మికి ప్రతీకారం తీర్చుకోవాల‌నే కసితో ఉంది.. ఇక,వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2023లో తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక స్కోర్ 283.. అది కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన పరుగులు ఇవి.. టీమిండియా.. పాక్‌తో ఇక్కడే మ్యాచ్‌ అడినా మొద‌ట బ్యాటింగ్ చేసే చాన్స్ రాలేదు. ఆ మ్యాచ్‌లో భార‌త‌ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో పాక్ 191 ప‌రుగుల‌కే కుప్పకూలింది. ఆ టార్గెట్‌ను టీమిండియా 30.3 ఓవ‌ర్లలో చేధించి విక్టరీ కొట్టింది… ఇదే పిచ్‌పై ఆస్ట్రేలియా 33 ప‌రుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 286 ప‌రుగుల‌కే ప‌ర‌మితమైనా.. బ‌ట్లర్ సేన‌ను 253కే క‌ట్టడి చేశారు.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఛేజింగ్‌ టీమ్‌ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. అయితే, గత ఫలితాల ప్రకారం, అహ్మదాబాద్‌లో ఛేజింగ్ చేసే జట్లకు అనవసర ప్రయోజనం ఏమీ లేదు. వేదికపై జరిగిన 30 ODIలలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మరియు ఛేజింగ్ చేసిన జట్లు ఒక్కొక్కటి 15 మ్యాచ్‌లలో ఒకేలా గెలిచాయి. చివరి 10 మ్యాచ్‌లలో, ఆ ఆటలలో ఆరింటిలో గెలిచిన రెండవ బ్యాటింగ్ చేసే జట్లకు అనుకూలంగా స్కేల్‌లు కొద్దిగా మాత్రమే ఉంటాయి.