మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఈరోజు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓడించిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్ సేనకు ఓ బ్యాడ్‌న్యూస్. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో రంగంలోకి దిగనుంది.
సెమీఫైనల్లో అలైస్సా హీలీ ఆడడంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. ఆమె ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు సమాచారం. హీలీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. సెమీస్ మ్యాచ్ కాబట్టి హీలీ తప్పక ఆడనుంది. సెమీస్‌లో హీలీ ఆడితే టీమిండియాను కష్టాలు తప్పవు. ఎందుకంటే హీలీ ఫుల్ ఫామ్‌లో ఉంది. గాయపడక ముందు ఆడిన రెండు మ్యాచ్‌లలో (భారత్, బంగ్లాదేశ్) సెంచరీలు చేసింది. మెగా టోర్నీలో హీలీ 4 మ్యాచ్‌ల్లో 98 సగటుతో 298 పరుగులు చేసింది. ఇదే ఫామ్‌ను హీలీ సెమీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది.
Also Read: Gold Price Today: షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయో తెలుసా?
వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా సెమీస్‌కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించింది. సెమీస్‌లో కూడా ఈ విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు భారత్ మూడు విజయాలు, మూడు అపజయాలను ఖాతాలో వేసుకుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లపై గెలిచి.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతుల్లో ఓడింది. న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
