ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అద్భుత బౌలింగ్‌తో ప్రపంచ మేటి బ్యాటర్లను సైతం వణికిస్తున్నాడు. బుమ్రా అంటేనే బ్యాటర్స్ భయపడిపోతున్నారు. ప్రస్తుతం బుమ్రాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా బుమ్రాను అందరూ కీర్తిస్తున్నారు. తామే గొప్ప అన్నట్లు మాట్లాడే.. ఆస్ట్రేలియన్లు కూడా బుమ్రాను పొగిడేస్తున్నారు. బుమ్రాను ఇప్పటికే చాలా సార్లు ఎదుర్కొన్నా అని, అయినా అతడి బౌలింగ్ శైలి అంతుచిక్కదు అని ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్ అన్నాడు. తాజాగా ఆసీస్ ఆటగాడు బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు.
కెరీర్ ముగించాక జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొన్నానని తన మనవళ్లకు చెప్పుకుంటా అని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. ‘జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా కెరీర్‌ను ముగిస్తాడు. నేను కెరీర్ ముగించాక.. బుమ్రాను ఎదుర్కొన్నానని నా మనవళ్లకు గర్వంగా చెప్పుకుంటా. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇటీవలి నెలల్లో బుమ్రాను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అది నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. వచ్చే టెస్టుల్లో బాగా ఆడదానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఏం జరుగుతుందో చూడాలి’ అని హెడ్ చెప్పుకొచ్చాడు.
Also Read: Viral Video: 40 ఏళ్ల వయసులో కూడా.. మైండ్ బ్లాకింగ్ క్యాచ్ పట్టిన డుప్లెసిస్!
ఇటీవలి కాలంలో ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా జట్టుకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023లో హెడ్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోనుంది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆరంభంలోనే మూడు వికెట్స్ కోల్పోయిన సమయంలో పట్టుదల ప్రదర్శించి.. సెంచరీ చేశాడు. హెడ్ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు కప్ మిస్ అయింది. టెస్టులో అరంగేట్రం నుండి భారత్‌పై స్థిరంగా రాణిస్తున్నాడు. 42.89 సగటుతో 815 పరుగులు చేశాడు. మొదటి టెస్టులో 89 పరుగులు చేసి జట్టుకు భారీ ఓటమిని తప్పించాడు.