IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తేలిపోయింది. అనేకమార్లు వర్షం అంతరాయం తర్వాత టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వర్షం ప్రభావంతో మ్యాచ్ 26 ఓవర్లకు పరిమితం చేయగా, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత జట్టు ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభ్‌మన్ గిల్ (10) త్వరగా పెవిలియన్‌కి చేరడంతో భారత్ మొదటి పవర్‌ప్లేలోనే ఒత్తిడిలో పడింది. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (11) కూడా నిలవలేకపోవడంతో భారత్ 50 పరుగుల దాటేలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
Breast cancer: చిన్న వయసులోనే రొమ్ము క్యాన్సర్.. ఆ ఉత్పత్తుల ప్రభావమేనా.?
ఇక ఆ తర్వాత ఆక్సర్ పటేల్ (31), కేఎల్ రాహుల్ (38) పరుగులతో, వారిద్దరి భాగస్వామ్యంతో భారత్ స్కోరును 100 దాటించారు. అయితే రాహుల్, వాషింగ్టన్ సుందర్ (10), హర్షిత్ రాణా (1) త్వరగా ఔట్ కావడంతో ఇన్నింగ్స్ మళ్లీ కుప్పకూలింది. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) కొంత ప్రతిఘటన చూపించాడు. కానీ, అతనికి సరైన భాగస్వామ్యం దొరకలేదు. ఫలితంగా భారత్ 136/9 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, మాథ్యూ కూహ్నేమాన్ తలో రెండు వికెట్లు తీసి భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. అలాగే మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్, మిచెల్ ఓవెన్ కూడా చెరో వికెట్ సాధించారు.
