Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I Accepted my mistake Said Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తన పార్ట్నర్ రుతురాజ్ గైక్వాడ్‌కు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని రెండో టీ20 మ్యాచ్ అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సందర్భంగా మాట్లాడుతూ వెల్లడించాడు. ‘మొదటి టీ20 మ్యాచ్‌లో రనౌట్ నా తప్పే. అందుకు నేను రుతురాజ్‌కు సారీ చెప్పా. నా తప్పును అతడి ముందు అంగీకరించా. రుతురాజ్ చాలా మంచి వ్యక్తి. ఎంతో జాగ్రత్తగా ఉంటాడు’ అని జైస్వాల్ తెలిపాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ డిమాండ్ డకౌట్ అయిన విషయం తెలిసిందే.
రెండో టీ20 మ్యాచ్ గురించి యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్ నాకు ప్రత్యేకమైనది. నా షాట్లన్నీ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. నిర్భయంగా షాట్లు కొట్టా. షాట్ల ఎంపిక విషయంలో కూడా స్పష్టంగా ఉన్నా. మైదానంలో స్వేచ్ఛగా ఆడు అని మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్య , కోచ్ లక్ష్మణ్ చెప్పారు. దీంతో నా ఆటలు మైదానంలో చూపించాలనుకున్నా. నేను ఆటను మెరుగుపర్చుకోవాలనుకుంటా. అంతకుమించి మరేదీ ఆలోచించను. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నా. మానసిక అంశాలపై దృష్టి పెట్టా. నా ప్రాక్టీస్ సెషన్లపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Sharad Pawar Rain: ఏమైనా సరే వెనకడుగు వేయం.. వర్షంలో తడుస్తూ ప్రసంగించిన 82 ఏళ్ల శరద్ పవార్!
తిరువనంతపురం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో యువ భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఆపై ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడిపోయింది. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవిబిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!