NTV Telugu Site icon

IND vs AUS Dream11 Prediction: భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. డ్రీమ్11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్

India Vs Australia Final 2023

India Vs Australia Final 2023

India vs Australia Dream11 Prediction Today Match: వన్డే ప్రపంచకప్‌ 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. మూడో ట్రోఫీపై భారత్ కన్నేయగా.. ఆరోసారి ప్రపంచకప్‌ ముద్దాడాలని ఆసీస్ భావిస్తోంది. టాప్ జట్ల మధ్య సమరం కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. కప్‌ను ఎవరు సొంతం చేసుకుంటారని క్రికెట్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. స్వదేశీ గడ్డపై జరగనున్న ఈ సమరంలో భారత్ విజయం సాధించాలని భారతీయులు అందరూ కోరుకుంటున్నారు.

వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ప్లేయింగ్ 11, డ్రీమ్11 టీమ్ మీదే ఉంది. భారత్ ఒక మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. మొహ్మద్ సిరాజ్ స్థానంలో ఆర్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడని అందరూ అంటున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు అశ్విన్ బౌలింగ్‌లో రాణించడకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు ఆసీస్ కూడా మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ స్థానంలో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ ఆడే ఛాన్స్ ఉంది.

తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్ (కీపర్), మార్నస్ లబుషేన్‌/ మార్కస్ స్టోయినీస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.

డ్రీమ్11 టీమ్:
వికెట్ కీపర్: కేఎల్ రాహుల్
బ్యాటర్లు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, గ్లెన్ మాక్స్‌వెల్
బౌలర్లు: మిచెల్ స్టార్క్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా