Australia announce fresh squad for Last Two T20s: భారత్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. నేడు మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్ డిసైడర్ మ్యాచుకు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. స్టీవ్ స్మిత్, ఆడం జంపాలు నేడు స్వదేశానికి వెళుతున్న నేపథ్యంలో మూడో టీ20 ఆడడం లేదు. మంగళవారం గౌహతిలో జరిగే మూడో టీ20 తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ మరియు సీన్ అబాట్ బుధవారం స్వదేశానికి బయలుదేరనున్నారు.
రెండు నెలలకు పైగా భారత్‌లో ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. దాంతో ప్రపంచకప్ 2023 గెలిచిన జట్టు సభ్యులలో ఆరుగురికి విశ్రాంతిని ఇచ్చింది. చివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా క్రికెట్ తన స్క్వాడ్‌ను ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ మాత్రమే టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. చివరి రెండు టీ20లకు ఆసీస్ యువకులతో బరిలోకి దిగనుంది.
ఇప్పటికే రెండు మ్యాచుల్లో నెగ్గి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌పై కన్నేసింది. గువాహటిలోని బర్సపర స్టేడియంలో నేటి రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. మూడో టీ20కి వర్షం ముప్పు లేదు కానీ మంచు ప్రభావం ఉండే అవకాశముంది.
Also Read: Virat Kohli Wicket: స్టేడియం లైబ్రరీలా మారిపోయింది.. విరాట్ కోహ్లీ వికెట్‌ను ఎప్పటికీ మర్చిపోను!
ఆస్ట్రేలియా జట్టు:
మాథ్యూ వేడ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, బెహ్రన్‌డార్ఫ్, తన్వీర్ సంగా, కేన్ రిచర్డ్‌సన్, బెన్ డ్వార్‌షుస్, నాథ్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, అరోన్ హర్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్పే.