Rain halts Shubman Gill-Shreyas Iyer Charge: అనుకున్నదే జరిగింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. ఆట నిలిచే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 79 రన్స్ చేసింది. క్రీజ్‌లో శుభమన్ గిల్ (32), శ్రేయాస్ అయ్యర్ (34)లు ఉన్నారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇండోర్‌లో వర్షం తగ్గింది. మ్యాచ్ త్వరలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. 16 పరుగుల వద్ద ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ పెవిలియన్ చేరాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 26/1. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. మరోవైపు శుభమన్ గిల్ కూడా గేర్ మార్చడంతో భారత్ 6 రన్ రేట్ కంటే ఎక్కువగా నమోదు చేసింది. అయితే గిల్-అయ్యర్ దూకుడుకి వరుణుడు అడ్డుకట్ట వేశాడు.
Also Read: Yadadri: యాదాద్రి కొండపై మరో అద్భుతం.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూ. 7.70 కోట్లతో డిజైన్
టీమిండియాకు ప్రపంచకప్ 2023 ముంగిట మిగిలింది రెండే మ్యాచ్‌లు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడబోతున్న శ్రేయస్ అయ్యర్ ఫామ్ అందుకునేందుకు ఇదే మంచి అవకాశం. తొలి వన్డేలో లేని పరుగుకు ప్రయత్నించి రనౌటైపోయిన అయ్యర్.. రెండో వన్డేలో దూకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటికే 20 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. వర్షం తగ్గక క్రీజులోకి వస్తే.. అయ్యర్ మరింత చెలరేగే అవకాశం ఉంది. శుభమన్ గిల్ ఫామ్ అందుకున్న విషయం తెలిసిందే.
