Site icon NTV Telugu

Inaya Sultana : ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడు.. ప్రతి రోజు నరకం చూశా: బిగ్‌బాస్ బ్యూటీ

Inaya Sultana, Bigg Boss

Inaya Sultana, Bigg Boss

సెలబ్రెటిల జీవితాలు బయటకు కనిపంచినంత అందంగా ఉండవు. ప్రతి ఒక్కరి కెరీర్ లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుంది. అలాగే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇనయా గురించి పరిచయం అక్కర్లేదు. ఒకటి రెండు సినిమాలో నటించిన ఈ హాట్ బ్యూటీ సోసల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్కిన్ షో చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుంది. అయితే షో ముగిసిన ఏడాది వరకు కెరీర్ బిజీగా సాగినా, ఆ తర్వాత ఆఫర్లు తగ్గిపోయి ఒంటరితనం వేధించిందని ఆమె తెలిపింది.

Also Read : The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి

‘నేను చనిపోయినా ఎవరూ రారు’ అనే భయం వేసిన సమయంలో గౌతమ్ అనే వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని, తనపై ఎవరూ చూపించని ప్రేమను కురిపించాడని చెప్పింది. ఆ ప్రేమను నిజమని నమ్మి అతనికి శారీరకంగా కూడా దగ్గరయ్యానని, తన సర్వస్వాన్ని అతనికి అర్పించానని ఇనయా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన అవసరాలు తీరాక, తన ఫేమ్ మరియు డబ్బును వాడుకుని ఆ వ్యక్తి తనను వదిలేశాడని ఆమె ఆరోపించింది. దీంతో తాను తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నానని, నిద్ర మాత్రలు లేనిదే నిద్ర పట్టని స్థితికి చేరుకున్నానని ఇనయా వాపోయింది. తనను మోసం చేయడమే కాకుండా, సమాజం ముందు తప్పుగా చూపించేలా మానిప్యులేట్ చేశాడని ఆ వ్యక్తిపై మండిపడింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని, కానీ తనను మోసం చేసిన వాడి కోసం ప్రాణాలు తీసుకోవడం వేస్ట్ అని ఆగిపోయానని చెప్పింది. ఒంటరితనంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం తన జీవితాన్ని నరకం చేసిందని, తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆమె కోరుకుంది. ప్రస్తుతం ఈ బాధ నుండి బయటపడి, మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఇనయా ప్రయత్నిస్తోంది.

Exit mobile version