NTV Telugu Site icon

CM KCR : రేపే కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు

Kcr

Kcr

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలను ఇనుమడింపజేసేలా కొత్త సచివాలయం నిర్మించుకున్నామని కేసీఆర్ అన్నారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలను సీఎం కేసీఆర్ తెలిపారు.

Also Read : Chennai: చెన్నై ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..

ఇప్పటికే. ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త సచివాలయా ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగనుంది.

Also Read : Minister KTR : రేపు కీలకమైన ఫైల్ పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం

ఆ తరువాత నేరుగా 6వ అంతస్తులో ఉన్న తన ఛాంబర్ లో సీఎం కేసీఆర్ అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య అధికారులు తమతమ ఛాంబర్లలో అడుగుపెట్టనున్నారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వచ్చాయట. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనుంది.

Also Read : ‘నాన్న’ సినిమాలో కూతురిగా నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు అన్ని శాఖల హెచ్ ఓడీలు.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపాల్ మేయర్లు తదితరులు పాల్గొంటారని సమాచారం. ఈ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.