NTV Telugu Site icon

Uk Plots: లండన్ లో ప్లాట్ల ధర మరి ఇంత చీప్ హా..

Uk Plots

Uk Plots

ఈ భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతో పాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది కేవలం భూమి మాత్రమే.. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే, యునైటెడ్ కింగ్ డమ్‌లో నిర్వహణ ఖర్చులు భరించలేక కోట్లాది రూపాయల విలువైన చేసే ప్లాట్లను కేవలం రూ.100 ( 1 పౌండ్‌కి ) విక్రయించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లండన్, సౌత్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల కొరత మరింత తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఆస్తి ధరలు, అద్దె ఖర్చులు రెండు పెరిగాయి. ఇల్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా సవాల్‌గా మారింది.

Read Also: Gam Gam Ganesha Teaser: బేబీ హీరో.. ఈసారి కామెడీ చేసి నవ్విస్తాడంట..?

అయితే, లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్‌లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల ( సుమారు రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్-2 లిస్టెడ్ ఫ్లాట్‌లను కేవలం 1 పౌండ్‌ (రూ.103)కే విక్రయించేందుకు కౌన్సిల్ ఒప్పుకుంది. 11 కోస్ట్‌గార్డ్ ఫ్లాట్‌లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కు రిలీజ్ చేయాలన్న సిఫార్సును కార్న్‌వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్‌ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకు వచ్చింది. కమ్యూనిటీ నేతృత్వంలోని ఈ ప్లాట్లను ప్రజల సౌకర్యం కోసం తిరిగి పునరుద్ధరిస్తారని కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు.

Read Also: Mark Antony Review: మార్క్ ఆంటోని రివ్యూ

ఎక్కువ సంఖ్యలో హాలిడే హోమ్‌లు ఉండే ఇంగ్లాండ్‌లో సెకండ్ హోమ్‌లు, హాలిడే హోమ్‌ల సమస్య కార్న్‌వాల్‌లో మరీ ఎక్కువగా ఉండింది. 2021లో ఈ ఏరియాలో 13,000 సెకండ్ హోమ్‌లు ఉన్నట్లుగా కార్న్‌వాల్ తెలిపింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ బిల్డింగ్ పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా ప్రకటించారు. అందులో భాగంగానే అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఈ ఫ్లాట్లను అమ్ముతున్నారు.