Site icon NTV Telugu

Pindam : ఆ రెండు ఓటీటీలలో పిండం మూవీకి సూపర్ రెస్పాన్స్..

Whatsapp Image 2024 02 18 At 11.45.32 Am (1)

Whatsapp Image 2024 02 18 At 11.45.32 Am (1)

కోలీవుడ్ నటుడు శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిండం’..ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 15న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, రవివర్మ, ఈశ్వరీ రావు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ మేకర్స్ సినిమా పై క్యూరియాసిటిని కలిగించారు. ఈ సినిమాను గర్భిణీలు, చిన్నారులు చూడొద్దంటూ రిలీజ్ కు ముందే హెచ్చరించారు . దీంతో ఈ మూవీ అంత భయంకరంగా ఉంటుందా.అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలయ్యింది. దీంతో థియేటర్లలో ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.థియేటర్స్ లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.పిండం సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోఅలాగే తెలుగు తమిళ్ భాషల్లో ఆహా వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది.

ఇక ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణం వహించారు.నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని దాని చుట్టూ ఓ కల్పిత కథాశం అల్లుకొని ఈ సినిమా ను రూపొందించారు. అన్నమ్మ (ఈశ్వరీరావు) తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక జ్ఞానంతో ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. ఆత్మలు ఆవహించినవారిని వాటి నుంచి విముక్తి కల్పిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్) అన్నమ్మ వద్దకు వస్తాడు. 1990ల నాటి ఓ సంఘటన గురించి అతడికి చెబుతుంది అన్నమ్మ. అదే ఆంథోనీ కుటుంబం కథ. ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పనిచేసే ఆంథోని (శ్రీరామ్) తన భార్య మేరీ (ఖుషి రవి), పిల్లలు సోఫి, తారలతో కలిసి ఊరి చివర ఉండే ఇంట్లోకి కొత్తగా వస్తారు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఆంథోని కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెడతాయి. గర్భంతో ఉన్న మేరీ మినహా మిగిలిన అందరిని ఆవహిస్తాయి. ఎక్కడికి వెళ్లినా కూడా వారిని ఆత్మలు వదిలిపెట్టవు. చివరికి ఆంథోని కుటుంబం ఆ ఆత్మల నుంచి ఎలా బయట పడింది.అస్సలు ఆ ఆత్మలు ఎవరివి అనేది అనేది ఈ సినిమా ప్రధాన కథ.

https://www.primevideo.com/detail/0N0LFPCMCLO4GHYJEI3Q13T1TR/ref=atv_dp_share_cu_r

https://www.aha.video/movie/pindam

Exit mobile version