Site icon NTV Telugu

Viral Video: ఇదేందయ్యా ఇది.. ఖగోళంలో అద్భుతం..

Suns

Suns

Viral Video: ప్రతిరోజు ప్రపంచం నలుమూలల ఏదో ఒక సంఘటనకు సంబంధించిన విషయం ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైన తర్వాత., ఏ విషయమైనా సరే కొంచెం నాలుమూలల సెకన్ల వ్యవధిలో తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా మీడియా ద్వారా అనేక విషయాలను ప్రజలు ఇట్లే తెలుసుకుంటున్నారు. ఇకపోతే., ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రంగాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆకాశంలో వింత సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

RG Kar EX-Principal: ఆర్‌జీ కార్ హస్పటల్ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్..!

సూర్యుడు ఒక్కడే. అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ప్రపంచంలో ఏ మూలన నుండి చూసిన మనకు ఒక్క సూర్యుడు మాత్రమే దర్శనమిస్తాడు. అయితే తాజాగా దీనికి విరుద్ధంగా చైనాలో మాత్రం ఒకేసారి ఏడు సూర్యులు దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి అయ్యేలా సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన చైనా దేశంలోని సీచువాన్ అనే ప్రాంతంలో ఆకాశంలో ఏడు సూర్యులు ఒక్క మాదిరిగా కనబడ్డారు. ఆగస్టు 19 ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వావ్.. ఇలాంటి దృశ్యాన్ని తాము ఎప్పుడూ వీక్షించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.., ఈ వీడియో కచ్చితంగా ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు. చూడాలి మరి చైనా ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి అప్డేట్ ఇస్తుందో.

Exit mobile version