NTV Telugu Site icon

Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..

Jill Irving

Jill Irving

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. ఇది 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు. ప్యారిస్ ఈ క్రీడలకు మూడవసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. క్రీడల మహా సంబరంలో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పతకాల కోసం పోటీపడతున్నారు. ఇందులో భారతదేశం నుండి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్కేట్‌బోర్డింగ్ లాంటి కొన్ని కొత్త క్రీడలు చేర్చబడ్డాయి. టోక్యో ఒలింపిక్స్‌ కంటే మెరుగైన ఆటతీరుపై భారత ఆటగాళ్లు కన్నేశారు. 117 మంది సభ్యుల బృందంతో భారత్ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననుంది. గత మూడేళ్లలో భారత బృందం అద్భుత ప్రదర్శన కనబరిచినందున ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఏడు స్థానాలను దాటాలనే భావంతో భారత క్రీడాకారులు అడుగుపెట్టనున్నారు. భారతదేశం దాదాపు ప్రతి క్రీడలో మంచి అనుభవం ఉన్న వారిని కలిగి ఉంది.

CM Chandrababu: సోషల్ మీడియాపై స్పెషల్‌ ఫోకస్.. ప్రత్యేక విభాగం పెడతాం..

ఇకపోతే 44 ఏళ్ల టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో అత్యంత వృద్ధ అథ్లెట్. బోపన్న మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడనున్నాడు. 14 ఏళ్ల ధినిధి దేశింగు భారత జట్టులో అతి పిన్న వయసు అథ్లెట్. బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ ధీనిధి దేశింఘు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుత ఒలింపిక్స్‌ లో పాల్గొనే ఆటగాళ్లందరి గురించి మనం చూసినట్లయితే.. 11 సంవత్సరాల 11 నెలల వయస్సు గల స్కేట్‌ బోర్డర్ జెంగ్ అతి పిన్న వయస్కుడైన పోటీదారు అవుతాడు. ఆమె 10 సంవత్సరాల 218 రోజుల వయస్సులో 1896 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఒలింపియన్, గ్రీకు జిమ్నాస్ట్ డిమిట్రియోస్ లౌండ్రాస్ కంటే ఒక సంవత్సరం పెద్దది.

Nepal: నేపాల్ లో ఏటా ఓ విమాన ప్రమాదం..! కారణం ఇదే..

ఇక మరోవైపు పారిస్‌ లోని అత్యంత వృద్ధ క్రీడాకారిణి కెనడాకు చెందిన జిల్ ఇర్వింగ్. ఆమె 61 సంవత్సరాల వయస్సులో ఈక్వెస్ట్రియన్ జట్టులో సభ్యురాలుగా ఒలింపిక్ అరంగేట్రం చేస్తుంది. ఆరు పదుల వయసు ధాటినా కూడా ఎంతో నేర్పు ఉండాల్సిన గుర్రాల స్వారీ ఆటలో పోటీ పడుతూ ప్రస్తుత యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ బామ్మ.