Kolkata Doctor Murder Case: ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని బయటపెట్టడానికి, పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిందితుడి సమాధానం సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా, నిందితుడు ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఈ పరీక్షలో నిందితుల శారీరక మార్పులని జాగ్రత్తగా స్టడీ చేసి, వారి ప్రతిచర్యను బట్టి సమాధానం నిజమో.. అబద్ధమో.. నిర్ణయించబడుతుంది.
Cyber Frauds: బీ అలర్ట్.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు..
ఇది అనేక భాగాలను కలిగి ఉండే యంత్రం. ఇందులో నిందితుడి శరీరానికి కొన్ని యూనిట్లు అతికిస్తారు. ఉదాహరణకు, యంత్ర యూనిట్లు వేళ్లు, తల, నోటిపై ఉంచబడతాయి. నిందితుడు సమాధానమిచ్చినప్పుడు, ఈ యూనిట్ల నుండి డేటా స్వీకరించబడుతుంది. ఇది ప్రధాన యంత్రానికి చేరడం ద్వారా అబద్ధం లేదా నిజామా అని గుర్తిస్తుంది. శరీరానికి అనుసంధానించబడిన యూనిట్లలో న్యుమోగ్రాఫ్, కార్డియోవాస్కులర్ రికార్డర్, గాల్వనోమీటర్ ఉన్నాయి. అలాగే చేతులకు పల్స్ కఫ్స్ కట్టుకుని, వేళ్లకు లోంబ్రోసో గ్లౌజులు వేసుకుంటారు. దీనితో పాటు రక్తపోటు, పల్స్ రేటు తదితరాలను కూడా యంత్రం ద్వారా పరిశీలిస్తారు. పల్స్ రేటు, శ్వాస మొదలైనవి శరీరంపై ఉంచే పరికరంలో న్యూమోగ్రాఫ్ ద్వారా పర్యవేక్షించబడతాయి. సమాధానం సమయంలో, అబద్ధం లేదా నిజం శ్వాస ద్వారా నిర్ణయించబడతాయి. ఇక హృదయ స్పందన, రక్తపోటు కార్డియోవాస్కులర్ రికార్డర్ తో పర్యవేక్షించబడతాయి. ఎందుకంటే, అబద్ధం చెప్పేటప్పుడు దానిలో అసాధారణ మార్పులు సంభవిస్తాయి. దీని ద్వారా నిజమో లేదో గుర్తించవచ్చు.
