NTV Telugu Site icon

IPL Mega Auction Unsold Players: పేరుకే టాప్ ప్లేయర్స్.. కొనడానికి ఇష్టపడని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు

Unsold

Unsold

IPL Mega Auction Unsold Players: ఎన్నో సంచాలను క్రియేట్ చేస్తూ ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగింది. అంచనాలకు మించి కొందరు కోట్లలో అమ్ముడుపోగా.. మరికొందరేమో పేరుకే టాప్ ప్లేయర్స్ అయినా వారిని కొనడానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇష్టపడలేదు. ఇకపోతే, మెగా వేలం మొదటిరోజు ఫ్రాంఛైజీలు అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చుపెట్టిన.. రెండో రోజు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో రెండోరోజు ముఖ్యంగా భారత పేసర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మొత్తంగా రెండు రోజులు జరిగిన ఐపీఎల్ వేలంలో 10 ఫ్రాంఛైజీలు 182 మంది ఆటగాళ్లను రూ.639.15 కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నాయి. మరోవైపు, పలువురు స్టార్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు సుముఖత చూపలేదు. ఈ లిస్ట్ లో టీమిండియా ఆటగాళ్లతోపాటు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే..

Also Read: Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్

ఇందులో ముందుగా విదేశీ ఆటగాళ్ల వివరు చూస్తే.. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌, ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో, డేవాల్డ్ బ్రెవిస్‌, బెన్ డకెట్, పాథుమ్ నిశాంక, స్టీవ్ స్మిత్, ముజీబుర్ రెహ్మన్‌, అదిల్ రషీద్, అకీలా హోస్సేన్, కేశవ్‌ మహరాజ్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, అల్జారీ జోసెఫ్‌, దిల్షాన్ మధుశంక, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, డారిల్ మిచెల్, గాస్ అట్కిన్సన్‌, సికిందర్ రజా, కైల్ మేయర్స్, మైకేల్ బ్రాస్‌వెల్, రోస్టన్ ఛేజ్, తబ్రైజ్ షంసి, జాసన్ హోల్డర్, టామ్ లాథమ్, షకీబ్ అల్ హసన్, మహమ్మద్ నబీ, టిమ్ సౌథీ, షై హోప్‌, అలెక్స్‌ కేరీ, లిటన్‌ దాస్, జోష్‌ లిటిల్, చరిత్ అసలంక, దునిత్ వెల్లలాగె,
డాసున్ శనక ఇలా ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు.

Also Read: Pan Card 2.0 Use: QR కోడ్‌తో వస్తున్న కొత్త పాన్ కార్డ్.. ఫీచర్లు ఏంటంటే

మరోవైపు భారత ఆటగాళ్ల పరంగా చూస్తే.. శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌, ఉమేశ్‌ యాదవ్, పీయూష్‌ చావ్లా, నవదీప్‌ సైని, శివమ్ మావి, కృష్ణప్ప గౌతమ్, కేఎస్ భరత్, యశ్ ధుల్, అన్మోల్‌ప్రీత్ సింగ్ ఇలా ఇంకా అనేకమంది ఆటగాళ్లు అన్ సోల్డ్ గా ఉండిపోయారు.