Haryana Election Results: హర్యానాలో అధికారం చేపడతాం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విజయం సాధించబోతున్నాం.. చివరి రౌండ్ కంటే ముందే స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం అని భూపేందర్ సింగ్ తెలిపారు. ఇకపోతే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం సమయంలో లెక్కింపు మొదలైనప్పటి నుంచి జాతీయ పార్టీలు బీజేపీ – కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటీనే కొనసాగుతోంది. మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా కనిపించిన మధ్యలో బీజేపీ అనూహ్యంగా లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుతానికి బీజేపీ 49, కాంగ్రెస్ 34 స్థానాల్లో లీడింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ లీడ్ లో లేకపోయినా హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గర్హి సంప్లా కిలోలి అభ్యర్థి భూపిందర్ హుడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇది హర్యానా ప్రజల విజయమని, హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Elections Results: హరియాణాలో టెన్షన్.. టెన్షన్.. జమ్మూకశ్మీర్‌లో వార్ వన్ సైడ్
ఇకపోతే మరోవైపు జమ్ము కశ్మీర్ లో బీజేపీకి షాక్ తగలడం ఖాయం అని అర్థమవుతుంది. ఆర్టికల్ 370 రద్దుతో తమకే ఓట్లు ఎక్కువగా పడతాయని భావించిన బీజేపీకి.. ఊహించని ఎదురుదెబ్బే తగిలేలా ఉంది. అనుకున్న దానికంటే కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ త్వరగానే దాటేసింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 49 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో, ఇతరులు 16 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.
Read Also: Jammu kashmir Elections: జమ్మూకశ్మీర్ ప్రజలను ఊపిరి పీల్చుకోనివ్వండి: షేక్ అబ్దుల్ రషీద్