NTV Telugu Site icon

ENG v AUS: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం.. అదరగొట్టిన లివింగ్‌స్టోన్‌..

Eng V Aus

Eng V Aus

ENG v AUS T20: లియామ్ లివింగ్‌స్టోన్‌ అసాధారణ ప్రదర్శనతో సోఫియా గార్డెన్స్ లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టి20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగా 1-1 తో సమమైంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్‌ కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేసి టీ20ల్లో ఈ వేదికపై అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ టి20 లలో ఇంగ్లాండ్ తరఫున లివింగ్‌స్టోన్‌ 50వ మ్యాచ్. తన రెండవ అర్ధ సెంచరీతో ఈ మైలురాయిని అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి.

Pistachio: పిస్తా తెగ తినేస్తున్నారా..? ప్రయోజనాలే కాదు ఇబ్బందులు కూడా తప్పవు సుమీ..

లివింగ్‌స్టోన్‌, జాకబ్ బెథెల్ తో కలిసి నాలుగో వికెట్ కు కలిసి 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా, లివింగ్‌స్టోన్‌ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ 34/2 వద్ద కష్టపడుతోంది. ఐకమరోవైపు బెథెల్ కూడా కేవలం 24 బంతుల్లో మూడు సిక్సర్లతో 44 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ పరుగుల లక్ష్యాన్ని మరింత చేరేలా చేశాడు. ఇక ఆస్త్రేలియా ఓటమి ఉన్నప్పటికీ పార్ట్ టైమ్ స్పిన్నర్ మాట్ షార్ట్ మూడు ఓవర్లలో 5-22 గణాంకాలతో తన తొలి ప్రొఫెషనల్ ఐదు వికెట్లను సాధించాడు. పురుషుల టీ20ల్లో ఆస్ట్రేలియాకు చెందిన మూడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే.

Most Double Centuries: కెప్టెన్‌గా టెస్టు క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్స్

ఇకపోతే, ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (31), మాథ్యూ షార్ట్ (28) కేవలం 4.2 ఓవర్లలో 52 పరుగులు జోడించి మ్యాచ్ కు బలమైన ఆరంభాన్ని అందించారు. ఫ్రేజర్ మెక్గర్క్ తో పాటు, జోష్ ఇంగ్లిస్ (42) కూడా ఆస్ట్రేలియాను 193/6 స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, లివింగ్‌స్టోన్‌ అసాధారణమైన 87 పరుగులతో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Show comments