NTV Telugu Site icon

Double Ismart: ఒళ్లు దగ్గరపెట్టుకొని తీసిన సినిమా “డబుల్ ఇస్మార్ట్”.. డైరెక్టర్ పూరి జగన్నాద్..

Double Ismart Puri

Double Ismart Puri

Double Ismart : ఆగస్టు 15న విడుదల అవనున్న సినిమాలలో ఒకటి “డబుల్ ఇస్మార్ట్” ఒకటి. రామ్ పోతినేని హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబుల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఆదివారం నాడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మూవీ టీం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దర్శకుడు పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ..

హాయ్ ఎవ్రీ వన్.. మీరు ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవు. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే.. ఒకే ఒక పేరు.. హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది. అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్.. ఇలా అన్ని తను పెర్ఫార్మ్ చేయడం వలనే అవుతుంది. తను మంచి యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఈ ఇస్మార్ట్ శంకర్ లేడు.

ఇక సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్ ని. 150 సినిమాల హీరో ఆయన. ఆయన ఈ సినిమాలో చేయడం సినిమాకి కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య చాలా బాగా పెర్ఫారం చేసింది. రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెలుగులో నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది ఆ అమ్మాయి. అలీ గురించి ఎక్కువ చెప్పను. ఇందులో అలీ గారి అలీగారి ట్రాక్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన యాక్టర్స్ కి, టెక్నిషియన్స్ కి థాంక్స్. ఛార్మి కౌర్ మా కంపెనీ స్ట్రెంత్. ఏదైనా పని చెబితే చేసుకొస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఫిలిం మేకింగ్ లో చాలా హార్డ్ టైమ్స్ వుంటాయి. అన్నీట్లో తను నిల్చుంది. విష్ రెడ్డి ఛార్మి వెనుక నిల్చుంటాడు. విష్ మా పిల్లర్.

నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద వున్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని వుంటాడు. థాంక్ యూ విషు. రామ్ డబుల్ ఎనర్జీతో ఈ సినిమా చేశాడు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తారు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని., ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు.? తీసే ముందు కథ చెప్తారా.? అని అడిగారు. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను.. చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు. తీసే ముందు ఒకసారి చెప్పండని ఆయన అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో తాను చాలా ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి ఉన్న ప్రేమ అభిమానంతో చేశారు. అయితే, తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకొని తీసిన ఆయన్ని కలుద్దామని చెప్పలేదు. నవ్వుతూ.. లవ్ యూ సర్.. అని అన్నారు. సినిమా మా అందరికీ బ్లాక్ బస్టర్ కావాలి. ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ.. పోలీస్ డిపార్ట్మెంట్ కి థాంక్స్., ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్లి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్ టైనర్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని అన్నారు.