Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వల్ప ఊరట లభించింది. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల కమిషన్ (ECP) వెలుపల నిరసనలకు సంబంధించిన కేసులో లాహోర్ హైకోర్టు సోమవారం అతని రక్షణ బెయిల్ పిటిషన్‌ను ఆమోదించింది. ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత ప్రదర్శనపై గంటల తరబడి రాజకీయ నాటకం తర్వాత చివరకు కోర్టు గదికి చేరుకున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధానికి మద్దతుగా నినాదాలు చేస్తూ పిటిఐ మద్దతుదారుల గుంపు లాహోర్ హైకోర్టు వెలుపలి ప్రాంగణాన్ని ముంచెత్తింది. 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, పార్టీ నిధుల వివరాలను దాచినందుకు గతేడాది జాతీయ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీ నిరసనలకు ఆయన పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది.
Read Also: Indore IT Firm : ‘దయచేసి ఇంటికి వెళ్లండి’ అంటున్న సరికొత్త సాఫ్ట్ వేర్
ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఇమ్రాన్ ఖాన్ చేసిన అభ్యర్థనను ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు గత వారం తిరస్కరించింది. దీంతో ఆయన లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ భారీ బలప్రదర్శన నిర్వహించారు. తన పార్టీ అయిన పాకిప్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కోర్టుకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ వెంట వేలాది మంది పార్టీ మద్దతుదారులు నడిచారు. ఆయన కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కోర్టు వద్దకు భారీగా తరలివచ్చిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
چئیرمین تحریک انصاف کا زمان پارک سے لاہور ہائی کورٹ تک کے سفر کی ویڈیو فوٹیجز pic.twitter.com/E69DLeo2ZU
— PTI (@PTIofficial) February 20, 2023