కడప జిల్లా కాజిపేటలోని జడ్పీ హైస్కూలులో విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి కడప ప్రభుత్వ ఆసుపత్రిలో 10మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. ఓ విద్యార్థిని ఐసియులో చికిత్స తీసుకుంటుంది. స్కూలు ఆవరణలో వాటర్ ట్యాంక్ లో కోతులు పోలాడుతున్నాయి. అవే నీటిని తాగడం వల్ల విద్యార్థినులకు అనారోగ్యానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. రోజుకు ఆరుగురు చొప్పున అశ్వస్థతకు గురవుతున్నారు. గత మూడు రోజులుగా వరుసగా రిమ్స్ లో చేరుతున్నారు.. విద్యార్థులు. వారం రోజుల క్రితం ప్రిన్సిపాల్ కు చెప్పినా పట్టించుకోలేదని తల్లదండ్రలు, విద్యార్థినుల ఆవేదన చెందుతున్నారు. చూస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు.
READ MORE: AP: లద్దాఖ్ లో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతి..గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పార్థివ దేహాలు