Site icon NTV Telugu

Ileana: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఇలియానా?

Ileana

Ileana

గోవా బ్యూటీ ఇలియానా పేరుకు పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. స్టార్ హీరోల తో జత కట్టింది.. ఈ మధ్య కాలంలో తాను ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది…పెళ్లి కాకుండానే తల్లవడంతో చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోయారు.అంతేకాదు కొడుకు పుట్టే వరకు కూడా తన భర్త ఎవరూ అనే విషయాన్నీ ఇలియానా బయట పెట్టలేదు. ఇక ఇలియానా భర్త విషయంలో ఎన్నో ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ అందులో ఏది నిజం కాలేదు. చివరికి ఇలియానానే తన భర్త గురించి చెప్పింది..

ఇక ఇలియానా కూడా ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.కొడుకు పుట్టాకే తనకి ఇలాంటి వ్యాధి వచ్చింది అని చెప్పింది.మరి ఇంతకీ ఇలియానా ఏ వ్యాధితో బాధ పడుతుందో చూద్దాం.. ఈ మధ్య సెలెబ్రేటీలు ఒక్కొక్కరు వారికున్న వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ తమ వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.. సమంతతో పాటు కల్పికా గణేష్, దగ్గుబాటి రానా, పూనమ్ కౌర్ వంటి  కొంతమంది నటినటులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలియానా కూడా తన కొడుకు పుట్టాక ఆ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది..

కొడుకును చూసుకోవడం కోసం నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది.ఫ్యామిలీ వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. అలాగే ప్రస్తుతం తన ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెడుతున్నానని, అదే సమయంలో తన కొడుకును కూడా దగ్గరుండి చూసుకుంటున్నానని ఇలియానా చెప్పుకొచ్చింది.. సినిమాల విషయానికోస్తే… కొత్త సినిమాలను ప్రకటించలేదు కానీ వెబ్ సిరీస్ లను చేస్తుంది..

Exit mobile version