గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మహేష్ తో కలిసి నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నాజూకు నడుము సొగసుతో ఇలియానా యూత్ ని బాగా ఆకట్టుకుంది.. అయితే టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైం లో ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాలని అక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. కానీ అక్కడ ఆమె కి నిరాశే మిగిలింది.. దీనితో ఈ భామ కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గాయి.అలాగే తన లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని బాగా డిప్రెషన్ లోకి తీసుకెళ్లాయి.. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సినిమాల కోసం ట్రై చేసింది.ఇటీవల ఇలియానా తాను ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియజేయలేదు.
రీసెంట్ గా ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.పెళ్లి కాలేదు అప్పుడే గర్భం, పిల్లలు ఏంటి అంటూ అంతా కూడా షాక్ అయ్యారు.చాలా రోజుల పాటు తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని ఇలియానా దాచిపెట్టింది. అయితే ఇటీవల అతడి ఫోటో షేర్ చేయడంలో ఇలియానా లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. అతడి పేరు మైఖేల్ డోలాన్ అని తెలుస్తోంది. తాజాగా ఇలియానా తన ముద్దుల కొడుకు తో దిగిన ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.తన కొడుకు పుట్టి రెండు నెలలు గడుస్తున్న సందర్భం గా ఇలియానా ఈ క్యూట్ ఫోటో షేర్ చేసింది. అప్పుడే రెండు నెలలు గడచిపోయాయి అని కామెంట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది