NTV Telugu Site icon

Microsoft: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Microsoftr

Microsoftr

మైక్రోసాఫ్‌ విండోస్‌, సర్ఫేస్‌ విభాగాలకు హెడ్‌గా ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరిని కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్‌ పనయ్‌ గతేడాది అమెజాన్‌లో చేరారు. దీంతో ఆయన స్థానంలో పవన్‌కు బాధ్యతలు అప్పగించారు. మైక్రోసాఫ్ట్‌లో పవన్ 2001లో చేరారు. దాదాపు మూడేళ్లుగా కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు.

పవన్‌.. ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పట్టా అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 23 ఏళ్లకు పైగా మెక్రోసాఫ్ట్‌లో అనుభవం ఉంది. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా పదవి చేపట్టారు. వీటితో పాటు మైక్రోసాఫ్ట్‌లో వివిధ పదవులు కైడా నిర్వహించారు. తాజా నియామకానికి ముందు ఆయన విండోస్ సిలికాన్ అండ్‌ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇది కూడా చదవండి: Heatwave: పెరుగుతున్న వేసవి ఎండలు.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు..

ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్‌లో డీప్‌మైండ్ విభాగం మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్‌ అధిపతిగా ప్రకటించింది. ఆ తర్వాత పవన్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. తాజా నియామకంతో ఆయన అమెరికా టెక్‌ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతంలో విండోస్‌, సర్ఫేస్‌ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. తాజాగా పవన్‌కే రెండింటి బాధ్యతనూ మైక్రోసాఫ్ట్‌ అప్పగించింది.

ఇది కూడా చదవండి: Geomagnetic Storm: భూమిని తాకిన “సౌరతుఫాన్”.. 6 ఏళ్లలోనే అతిపెద్దది..