Idupu Kayitham: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రూరల్ ఎంటర్‌టైనర్ ‘ఇడుపు కాయితం’. అనౌన్స్‌మెంట్ నుంచే తన విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా, డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తూ, తాజాగా ‘ఉల్లిపూల’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాగదుర్గ, ప్రియదర్శిపై చిత్రీకరించిన ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘ఉల్లిపూల’.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు అభినయ శ్రీనివాస్ అద్భుతమైన సాహిత్యం అందించగా, హేనా గ్రేస్ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. పల్లెటూరి నేటివిటీకి తగ్గట్టుగా సాగే ఈ మెలోడీ బీట్, విడుదలైన కొద్ది నిముషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్, షార్ట్స్ రూపంలో నెటిజన్లు ఈ పాటను బాగా ట్రెండ్ చేస్తున్నారు.
దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా ‘శ్రీలత’, ‘గడప’ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుని, సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ‘గోగులు గోగులు’ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి వరుస హిట్ సాంగ్స్‌తో మ్యూజికల్‌గా సక్సెస్ అయిన ‘ఇడుపు కాయితం’, డిసెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

