Site icon NTV Telugu

Mosquito Free Country: ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు! ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏంటో తెలుసా?

Iceland Mosquitoes

Iceland Mosquitoes

Mosquito Free Country: ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏంటో తెలుసా? ఐస్లాండ్. కానీ ఈ దేశంలో తొలిసారిగా ఈ దేశంలో దోమలు కనిపించాయి. వాస్తవానికి దేశంలో ఈ నెలలో మూడు దోమలు కనిపించాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ మూడు దోమల్లో రెండు ఆడవి, ఒక మగదోమ కనిపించదని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ దేశం గతంలో పూర్తిగా దోమలు లేని దేశంగా ఉండేది. కానీ దేశంలోని క్జోస్ పట్టణ నివాసి అయిన బ్జోర్న్ హ్జల్టాసన్ తన తోటలో ఈ మూడు దోమలను గుర్తించాడు.

READ ALSO: Gummadi Narsaiah Biopic : గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్

కులిసెటా అనూలాటా జాతికి చెందిన దోమలు..
బ్జోర్న్ హ్జల్టాసన్ మాట్లాడుతూ.. తన తోటలో ఈ కీటకాలు ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నంగా, ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఐస్లాండిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ దోమలు శీతాకాలంలో జీవించగల కొన్ని దోమ జాతులలో ఒకటైన కులిసెటా అనూలాటా జాతికి చెందినవని వెల్లడించారు.

వాస్తవానికి ఐస్లాండ్ చాలా చల్లగా ఉండే దేశం. దోమల వంటి కీటకాలు చల్లని రక్త జీవులు కాబట్టి అవి చలిలో జీవించలేవు. ఈ దోమలు తమ శరీర ఉష్ణోగ్రతను ఈ దేశంలో నిర్వహించలేవు, కాబట్టి వాటికి వెచ్చని వాతావరణం అవసరం. వెచ్చని దేశాలలో దోమలు హాయిగా జీవిస్తాయని, గుడ్లు పెట్టడం, మనుషులను కుట్టడం లాంటివి చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఐస్లాండ్ చల్లని వాతావరణం గతంలో ఈ దోమలకు అనుకూలం కాదు. కానీ వాతావరణ మార్పుల కారణంగా దేశంలో దోమలకు అనుకూలమైన ఉష్ణోగ్రతలను వచ్చాయని చెప్పారు.

దేశంలో దోమలు రావడానికి కారణాలు ఏంటి..
శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఐస్లాండ్‌కు దోమలు ఎలా వచ్చాయో స్పష్టంగా తెలియదని చెబుతున్నారు. కానీ గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఐస్లాండ్ వేడెక్కుతున్న వాతావరణాన్ని ఎదుర్కుంటోందని, ఉత్తర అర్ధగోళంలోని ఇతర దేశాల కంటే ఉష్ణోగ్రతలు నాలుగు రెట్లు వేగంగా దేశంలో పెరుగుతున్నాయని వెల్లడించారు. మే 2025లో అనేక ప్రాంతాల్లో వరుసగా 10 రోజులు 20°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. మే నెలలో ఎగ్లిస్టాడిర్ విమానాశ్రయంలో ఒక రోజు 26.6°C ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నారు. ఇక్కడి వాతావరణం ఇప్పుడు దోమలకు అనువైనదిగా మారిందని చెప్పారు.

దోమలు లేని ప్రదేశం ఏది?
ఇప్పుడు దోమలు ఐస్లాండ్‌లోకి ప్రవేశించిన తర్వాత, ప్రపంచంలో దోమలు లేని ఏకైక ప్రాంతం అంటార్కిటికా మాత్రమే. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. వాస్తవానికి అంటార్కిటికాలో నీరు గడ్డకట్టుకుని ఉంటుంది. అందువల్ల దోమలు గుడ్లు పెట్టడానికి లేదా జీవించడానికి ఇక్కడా అవకాశం లేదు.

READ ALSO: Anupama : దాని వల్ల తట్టుకోలేకపోయా.. అనుపమ ఎమోషనల్

Exit mobile version