NTV Telugu Site icon

Viral Video : బర్గర్ లవర్స్ కు షాకింగ్ న్యూస్..ఈ వీడియో చూస్తే జన్మలో తినరు..

Icecream Burger

Icecream Burger

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ తో బర్గర్ చేశాడు.. స్పైసిగా ఉంటే టేస్ట్ ను కాస్త తియ్యగా మార్చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

సాదారణంగా చీజ్, మీట్ తో ఎంతో స్పైసిగా ఉండే బర్గర్ లను తినే ఉంటారు.. ఇది మన వంటకం కాకపోయినా కూడా దీన్ని ఎక్కువగా మనవాళ్ళు ఇష్ట పడుతున్నారు.. అందుకే ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ మరియు చాక్లేట్ తో తయారు చేసిన బర్గర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది…

ఆ వీడియోలో ఒక వ్యక్తి చాక్లెట్ బర్గర్ ను తయారు చేస్తున్నాడు. చాక్లేట్ ఫ్లేవర్ తో ఉన్న ఓ బర్గర్ ముక్కను తీసుకుంటాడు.. దానిపై చల్లని ఐస్ క్రీమ్ ను ఉంచుతాడు.. ఆ తర్వాత ఏవో సాస్ లను యాడ్ చేస్తాడు.. తర్వాత కూల్ చేస్తాడు.. పైన మళ్లీ ఐస్ క్రీమ్ ను ఉంచి చాక్లేట్ సాస్, చాక్లేట్ తురుము జేమ్స్ లాంటివి పెట్టి సాస్ తో కలర్ ఫుల్ గా డెకరేషన్ చేస్తాడు.. అంతే తియ్యగా, చల్లగా ఉండే ఐస్ క్రీమ్ బర్గర్ రెడీ అవుతుంది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఓ రేంజులో కామెంట్స్ చేస్తున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..