NTV Telugu Site icon

Ice Cream: ఐస్ క్రీమ్ తినడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి తెలుసా?

Icecreams

Icecreams

ఐస్ క్రీమ్ పేరు వినగానే కళ్ళముందు కనపడుతుంది.. చాలా మందికి నోట్లో నీళ్లు ఊరిపోతాయి.. ఈ ఐస్ క్రీమ్ ను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. ఇక చిన్న పిల్లల గురించి చెప్పనక్కర్లేదు.. వద్దన్నా వినకుండా మారం చేసి మరి కొంటారు.. చల్లచల్లగా, తియ్యగా మనకు ఇష్టమైన ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఐస్ క్రీమ్స్ తింటే మంచిది కాదు కానీ.. అందరు తినకుండా అయితే అస్సలు ఉండరు.. ఏదైనా లిమిట్ గా తింటే మంచిదే కానీ అతిగా తింటే అనర్థమే.. అయితే ఐస్ క్రీమ్ ను లిమిట్ గా తీసుకుంటే బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

*. ఈ ఐస్ క్రీమ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఐస్ క్రీమ్ తినే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు..
*. అలాగే అధిక బరువు ఉన్నవారు కూడా ఐస్ క్రీమ్ ను ఎలాంటి సందేహం లేకుండా లాహించవచ్చంటున్నారు.
*.దంతాలు తొలగించిన తర్వాత ఐస్ క్రీమ్ తినమంటూ వైద్యులు చెబుతారు. ఎందుకంటే ఉబ్బిపోయిన చిగుళ్లను సాధారణ స్థితికి తీసుకుని రావడంతో ఐస్ క్రీమ్ ఔషధంలాగా పని చేస్తుంది..
*. వీటిని తినడం వల్ల పాల ఉత్పత్తులతో తయారైన క్రీమ్ లో పాలు, క్రీమ్ కలపడం ద్వారా ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడుతుంది. రక్తంలోకి చేరు చక్కెర వేగాన్ని మందగించడం ఈ పొరలో ఉన్న ప్రత్యేకత.. అందుకే అందరు వీటిని తీసుకోవచ్చు..
*. అదే విధంగా మానసిక ఒత్తిడి, చిరాకు, అసహనం వంటి సమస్యలు, మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కూడా ఒక చిన్న ముక్క ఐస్ క్రీమ్ తింటే చాలాు. చాలా వరకు మూడ్ సాధారణ స్థితికి వస్తుంది. ఇది మొదడులో సంతోషాన్ని ప్రేరేపించే సెరొటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది..
*. జలుబు, గొంతునొప్పి, జ్వరం ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదంటారు. కానీ ఐస్ క్రీమ్ మంచి ప్రోబయోటిక్. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది..
*. గర్భవతులు కూడా డాక్టర్ సలహా మేరకు తినవచ్చు.. చెప్పాము కదా అని ఎక్కడ పడితే అక్కడ తినడం అస్సలు మంచిది కాదు.. ఇది గుర్తుంచుకోండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments